తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో కేసు విచారణకు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరుకాలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు హైకోర్టు ఆశ్రయించిన రేవంత్ రెడ్డికి కోర్టు ఊరట ఇచ్చింది. ఈ కేసు విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు, మే 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటి, బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ట్రయల్ కోర్టులో నాలుగు సార్లు ఈ కేసు వాయిదా పడింది. దీంతో కాసం వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకువచ్చారు. జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్‌ను కొట్టేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

One thought on “తెలంగాణ సీఎం హైకోర్టులో ఊరట”
Comments are closed.