మైక్రోసాఫ్ట్‌-ఏపీ ప్రభుత్వం ఒప్పందం: 2 లక్షల మందికి ఏఐ శిక్షణ

MoU

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యువతలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నైపుణ్యాలు పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ, ఏపీఎస్ఎస్ఈ మధ్య ఎంవోయూ (MOU)పై సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఒకే ఏడాది వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది యువతకు శిక్షణను అందించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యంగా ఉంది.

ఈ శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా, 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో శిక్షణ, 30 ఐటీఐలలోని 30,000 మంది విద్యార్థులకు డిజిటల్‌ ప్రొడక్టివిటీపై శిక్షణను అందించనున్నారు.

ఈ ఒప్పందం ద్వారా యువతకు టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Read More

One thought on “మైక్రోసాఫ్ట్‌-ఏపీ ప్రభుత్వం ఒప్పందం: 2 లక్షల మందికి ఏఐ శిక్షణ

Comments are closed.