ప్రాక్టర్ & గాంబుల్ (P\&G) సంస్థలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజ సంస్థ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన శైలేష్ జేజూరికర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. శైలేష్ జేజూరికర్ గత మూడు దశాబ్దాలుగా ప్రాక్టర్ & గాంబుల్‌లో కీలక పదవుల్లో సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు విభాగాల్లో పనిచేసిన ఆయన, వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవం దృష్ట్యా సంస్థలో అగ్రస్థానం ఆయనకు దక్కింది.
ప్రాక్టర్ & గాంబుల్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (COO) ఉన్న జేజూరికర్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారని కంపెనీ వెల్లడించింది. ఈ నియామకం ద్వారా P\&G ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార వ్యూహాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత సంతతికి చెందిన మరో అధికారి గ్లోబల్ స్థాయిలో అగ్ర స్థానాన్ని అధిరోహించడం పట్ల భారతీయులు గర్వంగా భావిస్తున్నారు.
Read More : 623 కిమీ వేగంతో చైనా మాగ్లెవ్ రైలు రికార్డు

2 thoughts on “ప్రాక్టర్ & గాంబుల్ కొత్త సీఈవోగా శైలేష్ జేజూరికర్”
Comments are closed.