మియరిమ్ నదిలో బాలిక మృతదేహం కనుగొన్న జర్నలిస్ట్

బ్రెజిల్‌లోని మియరిమ్ నది ఒడ్డున భయానక సంఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక రైస్సా జూన్ 29న నదిలో ఈతకొడుతూ మాయమయ్యింది. ఈ ఘటనను కవర్ చేయడానికి అక్కడికి వెళ్లిన జర్నలిస్ట్ లెనిల్డో ఫ్రజావో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా నీటిలో ఆమె మృతదేహాన్ని తాకడం జరిగింది. ఈ దృశ్యం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది.

ఫ్రజావో మాట్లాడుతూ, “నీటిలో ఏదో తాకినట్టు అనిపించింది.. అది చేయిలా ఉంది.. ఆమె అయి ఉండొచ్చు!” అంటూ తన అనుభూతిని తెలిపారు. వెంటనే ఆయన రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు, జూన్ 30న జరిపిన గాలింపు చర్యల్లో రైస్సా మృతదేహం ఫ్రజావో నిలిచిన చోటే లభించింది.

స్థానికులు ఈ ఘటనతో షాక్‌కు గురవగా, వీడియో చూసిన సామాజిక మాధ్యమ వినియోగదారులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, ఆమె శరీరంపై హింసకు గల ఆధారాలు లేవు. ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. అదే రోజున సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

Read More : స్కూల్‌పై కుప్పకూలిన ఫైటర్ జెట్: 17 మంది చిన్నారులు మృతి

One thought on “మియరిమ్ నదిలో బాలిక మృతదేహం కనుగొన్న జర్నలిస్ట్

Comments are closed.