కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారుల బాధ్యతను స్వయంగా తనపై తీసుకున్నారు. ఈ చిన్నారులు జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాకు చెందినవారని సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీ సరిహద్దు గ్రామాల్లో పర్యటన చేసిన సందర్భంగా, అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను సేకరించాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు. దీననుసరించి జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ 22 మంది చిన్నారుల జాబితాను సిద్ధం చేసి రాహుల్ గాంధీకి అందజేశారు.
ఈ చిన్నారుల బాధ్యత రాహుల్ గాంధీయే చూసుకుంటారని హమీద్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ వరకు విద్య, వైద్యం, జీవనానికి అవసరమైన ఇతర ఖర్చులన్నీ రాహుల్ గాంధీ భరిస్తారని చెప్పారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని కూడా ఆయన వెల్లడించారు.
ఇది రాహుల్ గాంధీ సరిహద్దు ప్రాంత ప్రజల పట్ల చూపిస్తున్న సానుభూతి, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావిస్తున్నారు.
Read More : పుణేలో యువ ఇంజినీర్ ఆత్మహత్య
