పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఓటు చోరీ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనల కారణంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. విపక్షాల నినాదాల మధ్య సభ సజావుగా సాగకపోవడంతో, రాజ్యసభ ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చకు ముందుకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read More : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

2 thoughts on “పార్లమెంట్‌లో విపక్షాల నిరసన”
Comments are closed.