సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా జంతు ప్రేమికుల నిరసనలు

ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జంతు ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, నాగ్‌పూర్‌లలో ఆందోళనలు చేపట్టారు.

వీధి కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని, వాటిని షెల్టర్లకు తరలించడం ద్వారా ఇబ్బందులకు గురిచేయకూడదని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. షెల్టర్లలో కుక్కలకు సరైన వసతులు ఉండవని, వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Read More : పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

One thought on “సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా జంతు ప్రేమికుల నిరసనలు

Comments are closed.