రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదర్శనగర్ ప్రాంతంలోని ఒక ఇంటి డాబాపై ఉన్న డ్రమ్ములో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది హత్యగా అనుమానిస్తున్నారు.
ఘటన వివరాలు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హన్స్ రాజ్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సుమారు నెలన్నర క్రితం ఆదర్శనగర్ కాలనీలో ఒక వృద్ధురాలి ఇంట్లో అద్దెకు దిగాడు. హన్స్ రాజ్ స్థానికంగా ఉన్న ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. కొంతకాలంగా ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది.
ఆదివారం ఆమె ఇంటి డాబాపైకి వెళ్లగా, తీవ్రమైన దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాబాపై ఉన్న డ్రమ్ములో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, దానిని తెరచి చూడగా మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హన్స్ రాజ్ భార్యాపిల్లల కోసం గాలిస్తున్నారు.
Read More : పార్లమెంట్‌లో విపక్షాల నిరసన
