ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామాలు

రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో జెలెన్‌స్కీకి మద్దతుగా పలువురు ఐరోపా దేశాల నాయకులు కూడా పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు ‘నాటో’ తరహా భద్రతా హామీలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చర్చలు శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read More : శాంతి ఒప్పందం దిశగా అడుగులు ?

One thought on “ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామాలు

Comments are closed.