ఉగ్రదాడిలో తెలుగువారి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఉగ్రదాడిలో తెలుగువారు మృతిచెందడం ఎంతో దురదృష్టకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలు ఈ కష్టసమయాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చగా నిలుస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను పరిశీలిస్తే, హింసాత్మక మార్గాల ద్వారా ఎలాంటి ధ్యేయాలు సాధ్యం కావని స్పష్టం చేశారు. ఇలాంటి ఘోరానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతూ, ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తన పరిపూర్ణ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

Read More : ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య…

One thought on “ఉగ్రదాడిలో తెలుగువారి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Comments are closed.