గన్నవరం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మైనింగ్ కేసు విచారణ కోసం గన్నవరం పోలీస్ స్టేషన్‌కి శుక్రవారం వెళ్లారు. అయితే అక్కడ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన పోలీస్ స్టేషన్‌లో దాదాపు మూడు గంటల పాటు బెంచీపై కూర్చొని వేచి ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యంలో ఉన్న వంశీ ఆరోగ్య పరిస్థితిని చూసినప్పటికీ, అధికారులు స్పందించకపోవడంపై ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు కనీస గౌరవం కల్పించకుండా వ్యవహరించడాన్ని వారు తప్పుపట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన ఇప్పుడు గన్నవరం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Read More : ఫ్లెక్సీలతో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తత
