ఆపరేషన్ సిందూర్ పట్ల భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడలో కూడా శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభం అయి బెంజిసర్కిల్ వరకు సాగనుందని అధికారులు తెలిపారు.
పురందేశ్వరి ఈ ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను ఆహ్వానించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కూడా ర్యాలీలో పాల్గొనమని ఫోన్ చేసి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ ధృవీకరించారు. అలాగే, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు అని పురందేశ్వరి వెల్లడించారు.
Read More : జగన్ పాలన రాష్ట్రానికి తీరని నష్టం
