పహల్గామ్ ఉగ్రదాడికి నివాళిగా – SRH vs MI…?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.

తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పర్యాటకుల ఘటన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఈ మేరకు, రెండు జట్ల ఆటగాళ్లు, ఫీల్డ్ అంపైర్లు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి మైదానంలోకి దిగనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించి దాడిలో మృతులుగా మారిన వారికి గౌరవంగా నివాళులు అర్పించనున్నారు. అలాగే, ఆత్మీయంగా, శాంతియుత వాతావరణంలో మ్యాచ్ నిర్వహించేందుకు ఈ రోజు మ్యాచ్‌లో ఛీర్‌లీడర్స్‌ను అనుమతించబోమని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.

Read More : పీఎస్‌ఎల్‌లో షాహీన్ అఫ్రిదీకి లాహోర్ ఖలందర్స్ నుంచి గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్ గిఫ్ట్