తెలంగాణలో రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు!

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా, రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో రూ. 80 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీపీసీ బృందం సీఎంకు తెలిపింది. ముఖ్యంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనపై ఆసక్తి చూపింది. తెలంగాణలో 6,700 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని ఎన్టీపీసీ బృందం వివరించింది.

దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్టీపీసీ పెట్టుబడులకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read More : మంత్రి సీతక్కకు నోట్ల కట్ట ఇచ్చిన కోమటిరెడ్డి ?

One thought on “తెలంగాణలో రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు!

Comments are closed.