పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. గోపి ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, గోపిని రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది.
కస్టడీ ఆదేశాల ప్రకారం, గోపిని ఏసీబీ అధికారులు ఈ ఉదయం జైలు నుంచి బయటకు తీసుకువచ్చి, విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.
ఇప్పటికే ఈ కేసులో విడదల రజనికీ నోటీసులు జారీ చేయగా, ఆమెపై కూడా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.
Read More : జగన్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది
