మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
మల్లారెడ్డి ఏమన్నారంటే..
- తాను బీజేపీ, తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
- “నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. ఇంకా ఏ వైపు చూడాల్సిన అవసరం ఏముంది?” అని ఆయన ప్రశ్నించారు.
- తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పని చేశానని, ఇంకా మూడేళ్లు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతానని తెలిపారు.
- అసలు రాజకీయాలనే వదిలేసి, ప్రజలకు సేవ చేస్తూ మంచి విద్యాసంస్థలు (కాలేజీలు, యూనివర్సిటీలు) నడపాలని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో మల్లారెడ్డి త్వరలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read More : మంత్రి సీతక్కకు నోట్ల కట్ట ఇచ్చిన కోమటిరెడ్డి ?
