నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని, ప్రభుత్వ ప్రాధాన్యతలను సీతారామన్‌కు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రణాళిక చేసిన కొత్త ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి లభించే సహకారం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రులు జై శంకర్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీలను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై ముఖ్యమైన ప్రతిపాదనలు సమర్పించారు.

Read More : జగన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్, వైసీపీ మద్దతుపై ఉత్కంఠ

One thought on “నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ

Comments are closed.