ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను మోసం చేసిన ఒక నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. రఫీ అలియాస్ రవి కుమార్ అనే ఈ వ్యక్తి కాలేజీ అమ్మాయిలకు వలవేసి, వారిని పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో వెలుగులోకి వచ్చింది.

మోసాల పర్వం
అత్తాపూర్‌కు చెందిన రవి కుమార్ తన పేరును రఫీగా మార్చుకుని కాలేజీ అమ్మాయిలకు దగ్గరయ్యాడు. వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని పెళ్లి చేసుకునేవాడు. ఈ క్రమంలో వారి ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ విధంగా మోసం చేసిన ముగ్గురు యువతులను అతను పెళ్లి చేసుకున్నాడు.

రవి కుమార్ టార్చర్ తట్టుకోలేక అతని మూడో భార్య అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవి కుమార్ అలియాస్ రఫీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

Read More : కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య