జగన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్, వైసీపీ మద్దతుపై ఉత్కంఠ

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.

రాధాకృష్ణన్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ జగన్‌ను కోరినట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో వైకాపా వైఖరిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ప్రకటించిన జగన్, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ
తాజాగా, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై జగన్ పరోక్షంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నందున, ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగన్ మద్దతు బీజేపీకి ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Read More : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 5 గేట్లు ఎత్తివేత

One thought on “జగన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్, వైసీపీ మద్దతుపై ఉత్కంఠ

Comments are closed.