ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలికంగా నిరాశ ఎదురైంది. తనకు మళ్లీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ ఆయన గురువారం హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేసింది.
తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీ బలగాల ద్వారా భద్రత కల్పించాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన నివాసం, కార్యాలయాల వద్ద పటిష్టమైన భద్రతతో పాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్లు, అవసరమైన సిబ్బంది కల్పించాలన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను పెద్ద ఎత్తున తగ్గించారని, దీనిపై ఎలాంటి సమాచారం లేదా నోటీసు అందకుండా తీసుకున్న చర్యపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రస్తుత భద్రత తగినంత కాదని, పాత మాదిరిగానే జెడ్ ప్లస్ భద్రత వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
Read More : సీఎం శుక్రవారం అనంతపురంలో పర్యటన
