జమ్మూకశ్మీర్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన మురళీ నాయక్, గురువారం రాత్రి సరిహద్దు ప్రాంతంలో పాక్ చొరబాటుదారుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమర వీరుడు మురళీ నాయక్ త్యాగాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన –
“దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గానికి చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడికి నా గౌరవ నివాళులు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మురళీ నాయక్ మరణ వార్త కల్లితండా గ్రామాన్ని విషాదంలో ముంచింది. స్థానికంగా ప్రజలు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ ఘటన పట్ల రాష్ట్రం మొత్తం గర్వంతో పాటు బాధను వ్యక్తం చేస్తోంది.
Read More : తెలుగు జవాన్ వీరమరణం

One thought on “సీఎం చంద్రబాబు సంతాపం”
Comments are closed.