ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో (Legislative Council) పోలవరం (Polavaram) ప్రాజెక్టు పై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత (Opposition Leader) బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) ప్రశ్నించారు.
మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కూటమి నేతలు (Alliance Leaders) తమ గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం ఎత్తు (Height) తగ్గిస్తున్నారా లేదా? మాకు స్పష్టమైన సమాధానం (Clear Answer) చెప్పండి. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నాం” అని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) గుర్తుకు రావడం సహజమని బొత్స వ్యాఖ్యానించారు. “పోలవరం గురించి మాట్లాడాలంటే వైఎస్సార్సీపీ (YSRCP) గురించి మాట్లాడాల్సిందే” అన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ (TDP) సభ్యులు ఎదురుదాడికి (Counter Attack) దిగారని ఆయన ఆరోపించారు.

One thought on “పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా?”
Comments are closed.