హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టళ్ల ప్రాంతానికి చేరుకున్న ఓ జింకపై ఆ ప్రాంతంలో సంచరిస్తున్న కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన జింక, కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గచ్చిబౌలి పరిసరాల్లో చెట్లను భారీగా నరికి వేసిన కారణంగా అడవి జంతువులు తమ సహజ నివాస ప్రాంతాల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వాటిపై ఈ విధంగా ముప్పులు పొంచి ఉన్నాయని వారు పేర్కొన్నారు.
పరిసర వాతావరణాన్ని పరిరక్షించకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Read More : కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రుల కమిటీ చురుకుగా చర్యలు…

One thought on “హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకపై కుక్కల దాడి…”
Comments are closed.