వరంగల్‌లో మేగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

వ‌రంగ‌ల్‌లోని మేగా జాబ్ ఫెయిర్‌కు యువ‌త నుండి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ జాబ్ ఫెయిర్ లో సుమారు 23,000 మంది నిరుద్యోగ యువ‌కులు హాజ‌ర‌య్యారు. వారి భ‌విష్య‌త్తుకు కొత్త దిశ‌ను చూపేందుకు ఈ జాబ్ మేళా వేదిక‌గా నిలిచింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిరుద్యోగ యువ‌త‌తీ ఏకంగా 5,631 మందికి ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు స్పాట్‌లోనే అంద‌జేయ‌డం విశేషం.

ఇత‌ర అభ్య‌ర్థుల ప్రొఫైల్స్‌ను కూడా సంస్థ‌లు ప‌రిశీలించ‌గా, మరికొద్ది రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాలో దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో పాటు స్థానిక పరిశ్రమలు, స్టార్ట్‌ప్‌లు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళా Warangal జిల్లాలో అభ్యాసించిన, అర్హత కలిగిన అభ్యర్థులకు నిజమైన అవకాశాల వేదికగా నిలిచింది.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More : తెలంగాణ ప్రభుత్వ జాబ్ ఫెయిర్ ..