ప్రముఖ నటి అంజలి ఆనంద్ తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక భయంకర అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయిన ఆమె, ఆ అనురాగాన్ని ఎప్పుడూ అనుభవించలేకపోయానని చెప్పారు. అయితే, తన జీవితంలో ఓ వ్యక్తి తండ్రి అనుకూలంగా ప్రవర్తిస్తూ తనపై అసహజంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. మొదట బుగ్గలపై ముద్దు పెట్టడం, ఆ తర్వాత మరింత అసౌకర్యంగా మెలగడం తనకు అర్థం కాకపోయినా, అది తప్పే అని క్రమంగా గ్రహించానని అన్నారు.
ఆ వ్యక్తి తనను “తండ్రిలా” సంభోదిస్తూ నమ్మబలికాడని, కానీ తన ప్రవర్తన క్రమంగా అసహజంగా మారిపోయిందని అంజలి తెలిపారు. తాను చాలా చిన్నతనంలో ఉండటంతో, మంచో – చెడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ వ్యక్తి తన డ్యాన్స్ టీచర్ అని, చివరికి తన మొదటి ప్రియుడి సహాయంతో అతని నుండి బయటపడగలిగానని పేర్కొన్నారు.
అంజలి తన మొదటి ప్రేమ గురించి కూడా వివరించారు. మొదటి ప్రియుడితో రెండేళ్లు పాటు డేటింగ్ చేసినా, చివరికి బ్రేకప్ అయ్యిందని చెప్పారు. అయితే, అతని ప్రేమ వల్ల నిజమైన ప్రేమకు అర్థం ఏమిటో తెలుసుకుని, తన వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత అతనిని మళ్లీ కలిసినప్పుడు, తన జీవితంలో అతను ఓ ముఖ్యమైన భాగం అని అర్థమై, ధన్యవాదాలు చెప్పానని గుర్తు చేసుకున్నారు.

One thought on “తండ్రి పేరుతో నీచత్వం – నటి అంజలి ఆనంద్ హృదయవిదారక అనుభవం!”
Comments are closed.