రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బుధవారం భారీ వడగండ్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలపై సీరియస్ అయిన మంత్రి తుమ్మల… అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సమీక్షించి నివేదిక అందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తడవకుండా ధాన్యాన్ని కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కవర్లు లేక ధాన్యం తడిచిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే గోడౌన్‌లకు తరలించాలన్నది మంత్రిగారి ఆదేశం.
ఇక రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తుమ్మల స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన వ్యవస్థను అమలులోకి తేయాలని ఆయన ఆదేశించారు.
Read More : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకపై కుక్కల దాడి…

One thought on “అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..”
Comments are closed.