కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి షాక్

suicide

హైదరాబాద్: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్రెడ్డి (44) కుటుంబం ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. గతంలో ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన, కొంతకాలంగా ఉద్యోగంలేక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో సోమవారం విషాదకర ఘటన జరిగింది. కుమారుడు విశ్వాన్ రెడ్డి (10)కి విషమిచ్చి, కుమార్తె శ్రీతా రెడ్డి (15)కి ఉరేసి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం చంద్రశేఖర్రెడ్డి తన భార్య కవిత (35)తో కలిసి ఉరేసుకుని బలవన్మరణం చెందారు.

ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ, “నా చావుకి ఎవరూ కారణం కాదు.. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరీర్‌లోనూ, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను,” అని పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Read More