తెలంగాణ మంత్రి పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి దక్కేదని, అయితే నియోజకవర్గ ప్రజల అభీష్టంతోనే మునుగోడు నుంచి పోటీ చేశానని తెలిపారు. “నాకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడేది. కానీ, మంత్రి పదవి కావాలా? లేక మునుగోడు ప్రజలా? అని అడిగితే ఎప్పుడూ మునుగోడు ప్రజలనే ఎంచుకుంటాను” అని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, తన జూనియర్లకు కూడా మంత్రి పదవులు లభించాయని గుర్తుచేసిన రాజగోపాల్ రెడ్డి, “మంత్రిపదవి కోసం ఎవరి కాళ్లలో మొక్కాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పనులు ఎప్పుడూ చేయను” అని ధైర్యంగా ప్రకటించారు.
Read More : మంత్రి పొంగులేటి–హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం

One thought on “మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు”
Comments are closed.