నితిన్ ‘రోబిన్‌హుడ్’ నుంచి కేతికా శర్మ స్పెషల్ సాంగ్ – ‘ఆదిధా సర్ప్రైసు’ రిలీజ్!

Robinhood

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబిన్‌హుడ్’ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు విశేషమైన స్పందన పొందగా, తాజాగా మూడో పాట “ఆదిధా సర్ప్రైసు” కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ స్పెషల్ సాంగ్‌లో కేతికా శర్మ గ్లామరస్ లుక్‌తో అలరిస్తూ, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది. నితిన్, శ్రీలీల సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించడం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మాస్ బీట్‌కు నీతి మోహన్ – అనురాగ్ కులకర్ణి గాత్రం జతకలిసి పాటను మరింత ఆకట్టుకునేలా చేసింది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ కేతికా పాత్రను హైలైట్ చేస్తూ, అనూహ్య మలుపులతో సర్ప్రైస్ కలిగించేలా ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రోబిన్‌హుడ్’ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది. ఇంకా మూడు వారాల సమయమే ఉండటంతో, సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతూ, ఈ సినిమా థియేటర్లలో దుమ్ము రేపేందుకు సిద్ధంగా ఉంది.

Read More

One thought on “నితిన్ ‘రోబిన్‌హుడ్’ నుంచి కేతికా శర్మ స్పెషల్ సాంగ్ – ‘ఆదిధా సర్ప్రైసు’ రిలీజ్!

Comments are closed.