karachi bakery – మంత్రి సీతక్క ఘాటు స్పందన

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కరాచీ బేకరీపై బీజేపీ నేతలు శనివారం దాడికి దిగారు. పాకిస్తాన్‌లోని కరాచీ నగరాన్ని ప్రతిబింబించేలా బేకరీకి పెట్టిన పేరు తమ దేశంలో ఉండకూడదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బీజేపీ నేతలు “పాకిస్తాన్ ముర్దాబాద్”, “భారత్ జిందాబాద్” నినాదాలు చేస్తూ బేకరీ ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. బేకరీ పేరును తాత్కాలికంగా కప్పివేయడంతో గందరగోళం శాంతించింది. బేకరీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటు ఘటనపై మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తీవ్రంగా స్పందించారు. ‘‘కరాచీ బేకరీపై బీజేపీ నేతల దాడి హేయమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొట్టడం తగదు’’ అని ఆమె అన్నారు. దేశ విభజన సమయంలో కరంచంద్ కుటుంబం హైదరాబాద్‌కి వలసవచ్చి బేకరీ స్థాపించిందని గుర్తు చేశారు.

‘‘కరాచీ బేకరీ ఈ దేశ బిడ్డలదే. గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ వ్యాపారం చేస్తోంది. అలాంటిది దానిపై దాడి చేయడం సరికాదు,’’ అని మంత్రి పేర్కొన్నారు. కరాచీ బేకరీకి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కోణంలో ఈ ఘటనకు సంబంధించి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి.

One thought on “karachi bakery – మంత్రి సీతక్క ఘాటు స్పందన

Comments are closed.