తెలంగాణ రాష్ట్ర గద్వాల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితురాలిగా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల్‌రావు గుర్తించబడ్డారు. గద్వాల జిల్లా ఎస్పీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భార్య ప్రియుడితో కలిసి కిరాయి హంతకులను రంగంలోకి దించి భర్తను హత్య చేయించిన ఘోర కుట్ర వివరాలు వెల్లడించారు.
అదృశ్యం నుంచి హత్య దాకా..
ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే నెల 21న గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం అనంతరం హత్యగా నిర్ధారణ కావడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఘాతుకుల పక్కా ప్రణాళిక..
ఎస్పీ వివరించిన ప్రకారం, ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్‌రావుతో కలిసి తేజేశ్వర్‌ను హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించారు. ఈ కుట్రలో వారు సుపారీ గ్యాంగ్ సాయాన్ని తీసుకున్నారు. తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి GPS ట్రాకర్ ఉపయోగించారు. అనంతరం కారులో బలవంతంగా తీసుకెళ్లి తేజేశ్వర్‌ను హత్య చేశారు.
వివాహేతర సంబంధం.. రెండు పెళ్లికి కుట్ర
ఈ కేసులో హృదయవిదారకమైన విషయాలు వెలుగుచూశాయి. ఐశ్వర్య తల్లితో కూడా తిరుమల్‌రావు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలన్న తాపత్రయంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read More : అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన : DCM

One thought on “భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్‌రావు కిరాయి హంతకులతో కుట్ర.”
Comments are closed.