విశాఖ యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ, తైవాన్‌లో మూడు బంగారు పతకాలు సాధించి విశాఖను గర్వపెట్టింది..

తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో విశాఖ నగరానికి చెందిన దొంతారా గ్రీష్మ మూడు బంగారు పతకాలు కైవశం చేసుకుంది. ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గ్రీష్మ పెయిర్, పెయిర్ డ్యాన్స్, క్వార్టెట్ విభాగాల్లో మూడు బంగారు పతకాలను సాధించి, రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రీష్మ మరిన్ని విజయాలతో రాష్ట్రం మరియు దేశానికి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆయన ఆకాంక్షించారు.

గత నెల 25 నుండి 30 వరకు నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌లో గ్రీష్మ మరో రెండు ఈవెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. 16 ఏళ్ల ఈ యువ స్కేటర్ ప్రస్తుతం విశాఖ వ్యాలీ స్కూల్‌లో ప్లస్ టూ చదువుతుంది.

Read More : పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై ఎస్పీ ప్రకటన: