శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ తెల్లటి నురగలాంటి పదార్థం మేఘాన్ని తలపిస్తూ పొలాల్లో కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అది నిజంగా మేఘమేనా? ఆకాశం నుంచి భూమిపైకి పడిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు గ్రామస్తులు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందేమో’’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సహజ దృగ్విషయమా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదా? లేక మరేదైనా రసాయనిక ప్రభావమా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, స్థానిక అధికారులు దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Read More : భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్‌రావు కిరాయి హంతకులతో కుట్ర.

2 thoughts on “శ్రీకాకుళం జిల్లాలో భూతలానికి మేఘం?”
Comments are closed.