విజయనగరం నుంచి గోవా బయలుదేరిన సీనియర్ నేత, టీడీపీ ప్రముఖుడు అశోక్ గజపతిరాజుకు నేవీ అధికారులు గౌరవ వందనం అందించారు. ఈ సందర్భంగా నేవీ అధికారులు ఆయనకు సన్మానం నిర్వహించగా, అశోక్ గజపతిరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రేపు ఆయన గోవా రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు టీడీపీకి చెందిన కొంతమంది ఎంపీలు, ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న అశోక్ గజపతిరాజు కొత్త పదవిలో ఏ విధమైన మార్పులు తీసుకువస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read More : విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

One thought on “గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం”
Comments are closed.