తెలంగాణ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

revanthreddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రసంగిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. “కేసీఆర్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, లేక వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా?” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ గత 15 నెలలుగా శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేసీఆర్‌ 57 లక్షల రూపాయలు జీతంగా తీసుకుని, రెండు సార్లు మాత్రమే శాసనసభకి వచ్చారు” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డి, “కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, శాసనసభకు రావాలని కోరుకుంటున్నా. నిద్రపోయే వారిని లేపొచ్చు కానీ నటించే వారిని లేపలేము. ఆయన శాసనసభకు రాకుండా లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు. శాసనసభకు వచ్చి విలువైన సూచనలు ఇవ్వాలి” అని అన్నారు.

అదే సమయంలో, కాంగ్రెస్‌ ప్రభుత్వమూ రైతులకు ఇచ్చిన రుణమాఫీని మరియు ఇతర సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయములోనూ విమర్శలు గుప్పించారు. “మేమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇచ్చాం, ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చెల్లించాం” అని చెప్పారు.

మహిళల సాధికారత కోసం చేసిన పథకాల గురించి కూడా వివరించారు. “మేము మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు, రూ.12 వేలు రైతు కూలీలకు అందిస్తున్నాం. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, బీఆర్ఎస్ సభ్యులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన తెలిపి, వెంటనే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. అనంతరం, బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలిని వాకౌట్ చేశారు.

Read More

One thought on “తెలంగాణ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

Comments are closed.