బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒవైసీ దేశం వదిలి వెళ్లేలా చేస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. లేకపోతే ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుని బీజేపీలో చేరతారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రంజాన్ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్లు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన “జమ్మికి నమాజ్” వ్యాఖ్యపై ఒవైసీ చేసిన స్పందనను తప్పుబట్టారు.
‘నిన్న హోలీ ప్రశాంతంగా జరగకుండా అసదుద్దీన్ ఒవైసీ కుట్ర పన్నారని’ రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్లో అశాంతిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఒవైసీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
‘అసదుద్దీన్ ఒవైసీ మెంటల్ అయిపోయారు.. రేవంత్ రెడ్డి గారు, మీ కొత్త మిత్రుడిని మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి’ అంటూ రాజాసింగ్ సెటైర్లు వేశారు.

One thought on “అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్**”
Comments are closed.