ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. రాష్ట్రంలో నీటి ప్రాధాన్యతను ఉద్ధేశించడంతో పాటు ప్రజలకు జలవనరుల పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆయన ఈ పర్యటన చేపట్టారు. శ్రీశైలం డ్యామ్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రాజెక్టు అభివృద్ధి, నిర్మాణ పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన ఆసక్తితో వీక్షించారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత ముఖ్యమంత్రి స్వయంగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు నిండుదల, నీటి నిల్వలు, సాగు అవసరాలపై సీఎం చంద్రబాబుకు వివరాలు అందించారు. రాష్ట్రంలో సాగునీటి సరఫరా సజావుగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, నీటి వనరుల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీశైలంలోని ఈ పర్యటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జలసంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Read More : ఏపీ రైతుల సమస్యలపై కీలక అంశాలపై చర్చ

3 thoughts on “ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి”
Comments are closed.