హైదరాబాద్ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టులో మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి కోర్టు భవనంలో బాంబు అమర్చినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సందేశం అందిన వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌లను సంఘటనా స్థలానికి రప్పించారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, మొత్తం ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బాంబు నిఘా బృందాలు ప్రతి కోణాన్ని జల్లెడ పట్టి తనిఖీ చేశాయి. ఈ క్రమంలో కోర్టు వద్ద కాసేపు గందరగోళం నెలకొనగా, జనాల్లో భయాందోళనలు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి సస్పెక్ట్ పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

READ MORE : సిగాచి పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 44కి చేరింది