కుప్పంలో సీఎం పర్యటన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం (జులై 3) మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలం తుంసిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు. అనంతరం అక్కడి మోడల్ స్కూల్ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సీఎం చంద్రబాబు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 4:30కి శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి వెళ్లి “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు వివరాలు అందించనున్నారు.

ఈ రోజు సాయంత్రం 7:05 గంటలకు కుప్పంలోని తన నివాసానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం (జులై 4) 10:30 గంటలకు కుప్పం ఏరియా హాస్పిటల్‌లో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:15కి స్వగృహానికి చేరుకొని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 4:10కి తుమ్మిసిలోని హెలిప్యాడ్‌కి చేరుకుని, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ప్రభుత్వం జులై 7 నుంచి నెల రోజుల పాటు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కుప్పం నుంచే శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు ప్రజల ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. గత ఏడాది తమ ప్రభుత్వం చేసిన సేవలను, భవిష్యత్ లక్ష్యాలను ప్రజలకు వివరించనున్నారు.

Read More : కాకినాడ యువకుడి సృజనాత్మకతకు ప్రశంసల వెల్లువ

One thought on “కుప్పంలో సీఎం పర్యటన ప్రారంభం

Comments are closed.