టెక్నాలజీ అందరికీ అవసరం: సీఎం

ఆధునిక టెక్నాలజీని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన పశుసంవర్థక శాఖ Tech AI 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో, గతంలో జీఎఫ్‌ఎస్‌టీ (GFST) వంటి సంస్థల ద్వారా యువ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించామని గుర్తు చేశారు.

లైవ్ స్టాక్‌పై ఆధారపడే ప్రజల పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది లైవ్ స్టాక్ ఆధారంగా జీవనోపాధి కొనసాగిస్తున్నారని, లైవ్ స్టాక్ రంగం ద్వారా రాష్ట్రానికి 13.5 శాతం జీఎస్టీ కాంట్రిబ్యూషన్ వస్తోందని తెలిపారు.

“నేను నిత్య విద్యార్థినిని. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను,” అని సీఎం పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని, వాట్సాప్ ద్వారా అన్ని వ్యవసాయ సేవలు అందేలా ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

సముద్రతీరాన్ని అభివృద్ధి చేస్తాం

1000 కిలోమీటర్లకు పైగా ఉన్న రాష్ట్ర సముద్ర తీరాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ మెరైన్ ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్‌తో పాటు గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అంగీకరించిందని గుర్తు చేశారు. ఇది విభజన హామీలో భాగమని తెలిపారు.

Read More : విదేశీ బ్యాంకుల రుణాల కోసం చర్చలు

One thought on “టెక్నాలజీ అందరికీ అవసరం: సీఎం

Comments are closed.