బండి సంజయ్ సంచలన వర్డ్స్

Bandi sanjay

“భారత్ గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ, “బీజేపీ గెలిచి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తోంది, ఉద్యోగ అవకాశాలను పెంచుతోంది. కానీ, నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం మాత్రం అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలా అనిపించింది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

“BRS కుల గణనను సమర్థిస్తోంది. BRS లెక్క ప్రకారం 51% BC జనాభా, Congress లెక్క ప్రకారం 46%. అసలు ఎవరిదీ నిజం? ఎవరిదీ తప్పు?” అని ప్రశ్నించారు బండి సంజయ్. “12% ముస్లిం జనాభాకు 10% రిజర్వేషన్ ఇస్తే, మిగతా 80% ప్రజలకు నష్టం జరగదు?” అంటూ నిలదీశారు. “తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసులపై CBI విచారణ ఎందుకు కోరడం లేదు? నిజాయితీ ఉంటే CBI విచారణ కోరండి, మేము అరెస్ట్ చేస్తాం” అని సవాల్ విసిరారు. “ప్రభాకర్ రావు పారిపోవడానికి సహాయపడింది కాంగ్రెస్ పార్టీయే. కారు రేస్ కేసులో KTR పాత్ర ఉందని స్వయంగా క్యాబినెట్ మంత్రులు పేర్కొన్నారు. మరి KTR కు నోటీసు ఎందుకు ఇవ్వడం లేదు?” అని ప్రశ్నించారు.

“KCR హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ ఎందుకు జరిపించరు? కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడానికి కాంగ్రెస్‌లో ధైర్యం ఉందా? జన్వాడ ఫార్మ్‌హౌస్‌ను ఎందుకు కూల్చడం లేదు?” అని నిలదీశారు బండి సంజయ్. “CM రేవంత్ రెడ్డి అరెస్టయి జైలులో ఉన్నాడు, అది జన్వాడ కేసు కారణంగానే. ఈ అంశం BRS–Congress మధ్య చీకటి ఒప్పందం ఉందని స్పష్టం చేస్తోంది” అని ఆరోపించారు.

“మూసీ నది శుద్ధికరణ కోసం 15 వేల కోట్లు సరిపోతే, రాబర్ట్ వాద్రా ఆనందం కోసం ఈ ప్రాజెక్ట్ అంచనాను లక్ష కోట్లకు పెంచాడు రేవంత్ రెడ్డి” అని విమర్శించారు. “ప్రభుత్వ నోటిఫికేషన్ కేవలం 20 వేల ఉద్యోగాలకే ఇచ్చారు. మరి 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతున్నారు?” అంటూ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read More