తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం

Anna Konidela Tirumala donation

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజామున దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలో ప్రవేశించి, శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అఖిలాండంలో హారతులు ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

ఉదయం 10 గంటల సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించిన అన్నా కొణిదల, తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ విరాళం ఎస్వీ అన్నదాన ట్రస్టుకు అందించబడింది.

అనంతరం అన్నా భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని వడ్డించి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఆమె సేవా భావనను ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది భక్తులు ప్రశంసించారు.

Read More


One thought on “తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం

Comments are closed.