ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవి చూసిన విషయం బయటకొచ్చింది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నీటిపాలయ్యాయి. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారని తీవ్రంగా విమర్శించారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, రైతులను అణగద్రొక్కడంతో గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని, ఖరీఫ్ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకుండా దిగుబడులు తగ్గాయని, గిట్టుబాటు ధర దొరక్కుండా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు పంట నీటిపాలవడంతో వారు మరింత నష్టాల్లో పడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలన్నారు. అలాగే, పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జగన్ సూచించారు.
Read More : ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు రైతుల నష్టం”
Comments are closed.