అమర్‌నాథ్ యాత్రలో బస్సు ప్రమాదం

జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. రాంబన్ జిల్లా చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద ఆగి ఉన్న వాహనాలను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 36 మంది యాత్రికులు స్వల్పంగా గాయపడగా, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియజేయడానికి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ యాత్ర సందర్భంగా ప్రయాణికుల భద్రతపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Read More : భోపాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మలుపుల మాయాజాలం

One thought on “అమర్‌నాథ్ యాత్రలో బస్సు ప్రమాదం

Comments are closed.