Godavari : 20 అడుగులకు చేరిన నీటిమట్టం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి ప్రభావంతో గోదావరి నది ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం కేవలం 4 అడుగులు మాత్రమే ఉన్న నీటిమట్టం, శుక్రవారం ఉదయానికి 14.5 అడుగులకు చేరింది. తాజాగా అది 20 అడుగులకు పెరిగిందని కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) అధికారులు వెల్లడించారు. గోదావరిలో నీటి మట్టం నిరంతరం పెరుగుతుండటంతో నదీతీర ప్రాంతాల్లోని స్నాన ఘట్టాల వరకు వరద నీరు చేరింది. పలు తక్కువ ప్రదేశాల్లో నీరు చేరే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరంలేకుండా నదీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

Read More : అమర్‌నాథ్ యాత్రలో బస్సు ప్రమాదం