రైతు అవతారమెత్తిన ఉత్తరాఖండ్ సీఎం ధామి

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తన అధికారిక తీరికను పక్కనపెట్టి పూర్తిగా కొత్త రూపంలో ప్రజల ముందుకు వచ్చారు. వ్యవహార శైలి భిన్నంగా, రైతు వేషధారణలో పొలంలోకి దిగిన ఆయన, కాడెద్దులతో నాగలి పట్టి పొలం దుక్కి, స్వయంగా వరి నాట్లు వేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ముఖ్యమంత్రి ధామి తన స్వగ్రామంలో ఉన్న సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు. పొలాన్ని దుక్కి అక్కడున్న రైతులతో కలిసి ఆవేశంగా నాట్లు వేశారు. సాధారణ రైతుల్లా వ్యవహరించిన సీఎంను చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధామి స్వయంగా పొలాల్లోకి దిగడం రైతులకు మద్దతుగా నిలిచింది. అయితే మరోవైపు, కొన్ని జిల్లాల్లో కురుస్తున్న విపరీత వర్షాలు కొండచరియలు విరిగిపడేలా చేస్తుండగా, కొన్నిచోట్ల వరదలు పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.

Read More : భోపాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మలుపుల మాయాజాలం