మళ్లీ ముదిరిన షమీ-హసీన్ వివాదం

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, అతని మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల కోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజుల్లోనే హసీన్ జహాన్ చేసిన కౌంటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. షమీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. షమీకి మనస్తత్వం లేదని, క్రూరమైన వ్యక్తి అని హసీన్ ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన పోస్టులో… ‘‘ఎంతో మంది నేరస్థులకు, వేశ్యలకు డబ్బులిచ్చావు. అదే డబ్బును మన కుమార్తె భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే నీ జీవితం గౌరవంగా ఉండేది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. ‘‘భగవంతుడు నాకు ధైర్యం, సహనం ఇచ్చాడు. అందుకే న్యాయ పోరాటం కొనసాగుతోంది. చట్టంపై నాకున్న నమ్మకమే నాకు బలమయ్యింది. నువ్వు పురుషాధిక్య సమాజంలో మద్దతు పొందగలవేమో కానీ, ఒకరోజు నీవు చేసిన తప్పులకు శిక్ష తప్పదు’’ అంటూ షమీపై వ్యాఖ్యానించారు.

గమనించదగ్గ విషయం ఏంటంటే.. 2014లో షమీ-హసీన్ జహాన్‌ల వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె ఉంది. 2018లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతం హసీన్ దాఖలు చేసిన గృహ హింస కేసు కోర్టులో ఉంది. ఇటీవలే కలకత్తా హైకోర్టు, కుమార్తె సంరక్షణ భాద్యతపై షమీ భరణం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయగా, వాటి నేపథ్యంలోనే ఆమె తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Read More : ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ టెస్టులో ప్యాట్ కమ్మిన్స్‌ అద్భుత క్యాచ్‌

One thought on “మళ్లీ ముదిరిన షమీ-హసీన్ వివాదం

Comments are closed.