మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సుభాష్‌నగర్‌లో ఇటీవల నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి వైరల్ అవుతోంది. పాములా మలుపులతో ఉండే ఈ వంతెన, తురుగుడు మలుపులు, తిరుగులు వల్ల ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. ఇంజినీరింగ్ లోపాల కారణంగా మంగళవారం రోజులోనే వంతెనపై రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “అప్పుడొకప్పుడు 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడేమో సర్పపు ఆకారంలో మలుపులు” అంటూ ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ వంతెనపై అధికారులు స్పందించి, తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read More : ఢిల్లీ కరోల్ బాగ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం

2 thoughts on “భోపాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మలుపుల మాయాజాలం”
Comments are closed.