“రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి”

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

టీగీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలో ఉండనున్నాడు. బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జైపుర్ వెళ్లి, అక్కడ జరుగుతున్న బంధువుల వివాహంలో పాల్గొంటారు. ఆ తర్వాత, తిరిగి ఢిల్లీ చేరుకుని, కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అనంతరం క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు.