“మంచు కుటుంబంలో మంటలు: మోహన్ బాబుకు చెందిన జల్‌పల్లి ఇంటి విషయంలో పందెం!”

ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో మంటలు?

సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో విశాలమైన ఇల్లు నిర్మించుకున్నారు. ఈ ఇంటిలో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సిబ్బంది గదులతోపాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇంటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఫిల్మ్ నగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు అప్పగించారు. ఇప్పుడు జల్‌పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.